ఎన్నికల వ్యూహకర్తను మార్చేసిన చంద్రబాబు

  • చాలా కాలంగా టీడీపీకి పని చేసిన రాబిన్ శర్మ
  • రాబిన్ శర్మ టీమ్ పై అసంతృప్తిని వ్యక్తం చేసిన చంద్రబాబు
  • కొత్త వ్యూహకర్తగా సునీల్ చేబ్రోలుతో ఒప్పందం
తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ బాధ్యతల నుంచి ఆయన తప్పుకున్నారు. రాబిన్ శర్మ స్థానంలో ప్రశాంత్ కిశోర్ టీమ్ మాజీ సభ్యుడు సునీల్ చేబ్రోలుతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే కేవలం మూడు నెలలకు మాత్రమే సునీల్ తో ఒప్పందం చేసుకున్నట్టు తెలుస్తోంది. సునీల్ టీమ్ పనితీరు నచ్చితే ఒప్పందాన్ని పొడిగించాలనే యోచనలో చంద్రబాబు ఉన్నారని సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు పని చేసిన టీమ్ లో సునీల్ ఉన్నారు.

మరోవైపు రాబిన్ శర్మ కూడా ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐప్యాక్ లో పని చేశారు. చాలా కాలంగా ఆయన టీడీపీ కోసం పని చేశారు. వాస్తవానికి రాబిన్ శర్మ పనితీరు పట్ల చంద్రబాబు సంతృప్తిగానే ఉన్నప్పటికీ, ఆయన టీమ్ పట్ల అసంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే రాబిన్ శర్మ తప్పుకున్నారు. మరి సునీల్ చేబ్రోలు అండ్ టీమ్ వ్యూహాలు టీడీపీకి ఏ మేరకు ఉపయోగపడతాయో వేచి చూడాలి.

Chandrababu
Telugudesam
Election Strategist
Robiln Sharma
Sunil Chebrolu

More Telugu News